పర్సు…పరుసే

పర్సు…పరుసే

యథాలాపంగా స్నేహితులం కొందరం, ఇంట్లో పని ఎగ్గొట్టి మా సమావేశానికి అనువైన ఆదివారం, ఒక కాపీ (కాఫీ) కొట్లో (కొట్టేమిటి అసహ్యంగా ..!) కలుసుకుని, అత్యంత విలువైన మాటలు మాట్లాడుకుంటున్నాం. ఒకరు ఒబామ అంటే, వేరొకరు రామ్ని. ఇలా అమెరికాకి కాబోయే రాష్రపతి గురించి ఒకటే చర్చ. వెధవది, ఇంట్లో పప్పు వండాలో, కొత్త సొఫా కొనాలో లెదో, అమ్మాయికి డాన్సు నేర్పాలో లేదో లాంటి చిన్న చిన్న ఇంటి విషయాలు ఇల్లాలికి వదిలేసి, దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు నిర్ణయించే అధికారం కొల్పోకుండా, మా మానాన్ని మేము మా లొకంలో విహరించే సమయానికి వూడిపడ్డాడు ఇంకో కోతి (అదేనండీ స్నేహితుడు). వీడి గురించి చెప్పాలంటే కవితే కరెక్టు..

నెత్తి మీద వున్నాయి వేలెడెన్నివెంట్రుకలు,
ఎత్తి పెట్టి వేసినా నాలుగంటె నాలుగే
క్రొత్తగా ఏంచెప్పను వీడికున్న అంట్రుకలు
నత్తిగా చెబుతాడు బోలెడన్ని కోతలే

కొంత మందికి మాట్లాడడం ఒక కళ, వీడు వచ్చాదంటే వేరేవాళ్ళు మాట్లడడం కల్ల. హెఫ్నెర్ అని ఒక ‘కళా’కారుడు కలడు. అమెరికాలో రాష్త్రపతి పేరు తెలియకపోయినా ఫరవాలేదు కానీ, వీడి గురించి మాత్రం తప్పకుండా తెలియాలి, వాడు సేవలందించే మార్గం అటువంటిది మరి. ఆ మహాను ‘భౌవ్’ లాగా, వీడు కూడా వెల్వెట్టు ప్యాటు, చలేస్తే వెల్వెట్టూ జాకెట్టు, లేదంటే కనీ వినీ ఎరుగని ఒక టీ-షర్టూ వేసుకోస్తాడు. మరి మగానుభావులకి చేతిలో ఎదో ఒక ఆభరణమో, ఆయుధమో వుండాలి కద. మరి మా వాడికి ఎంటా అని అడుగుతారా? (మీ ఊహ కి కూడా అందదు… కష్టపడకండి చెబుతాను) మా వాడి పర్సు, పరుసా? మరే, పరుసే. నా తలకాయ అంటారా (అది మీ ఖర్మ)? మరి చూసి తీరవలసిందే మరి. వినాయకుడి సైజుకి బొజ్జలాగా, పాత మొగుడి నెత్తి మీద బొప్పిలాగా, టిప్పు సుల్తాను చేతిలో కత్తి లాగా, మా వాది చేతిలో పర్సు. ఎందుకంటారా? అది మరి జేబులో పట్టాదుగా! మరి అందరూ పడేసిన కాగితాలు ఎరుకుంటాడో, లేక వీడు పడేసాకే మునిసిపాల్టీవాళ్ళు ఎరుకుంటారో కనీ, ఈ పర్సనబడే వస్తువుంది చూసారూ..అది ఒ గజం పొడుగూ, అరగజం వెడల్పూ, మహభారతం అంత మందం వుంటుంది. ఆవేశపడి తొంగిచూసేరు సుమా, జాగ్రత్త, పరా హుషార్, అలక్ నిరంజన్, అబ్ర క దబ్ర (ఇంక ఉపమానాలు చాలు). చిత్రగుప్తుడి చిట్టాలాగా, ఆ పర్సు నిండా కాగితాలే. వుండబట్టలేక అడిగేసాను ఓసారి. “నువ్వు సంచీ కొనబోయి పర్సు కొన్నావా, సంచీ అనుకుని పర్సు లో పెట్టావా?” అని. కానీ వాడికి ఈ పర్సు అంగవైకల్యం అయిపొయింది. ఎంచేతంటరా?, ఒక చెయ్య ఆ పర్సుకే అంకితమైపోయింది మరి, వున్నవి రెండేనాయె. అది జేబులోనా పట్టిచావదు. అంత కష్టపడి అది మొయ్యడం ఎందుకూ అంటే, అది వాడి ఆస్తాయె, అడగడానికి మేమెవరు. అంత మాహత్యం వున్న పర్సుకి కవితాంజలి.

పర్సులో పెట్టావ పదివేల డాలర్లు,
రుసుము కట్టిన ప్రతీ రసీదు పెట్టావ,
ఊసుపోక పేపర్లు ఉత్తినే కుక్కావ,
పసవున్న పడుచుల్ల ఫోటోలు దాచావ!

….ఇంకా వుంది (అంత వరకూ చొంగ కార్చవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »